23-01-2026 12:41:37 AM
అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
ముషీరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): ప్రజలకు మెరుగైన సేవలు అందిం చడమే తమ లక్ష్యమని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ఈ మేరకు గురువారం అంబర్పేట నియోజకవర్గం బాగ్ అంబర్పేట్ డివిజన్ పరిధిలోని సీఈ కాలనీలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించ నున్న నూతన సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ స్థానిక కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమమన్నారు. డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు జిహెచ్‌ఎంసి డిఈఈ ప్రవీణ్ కుమార్, జలమండలి అధికారులు డిజీయం విష్ణు వర్ధన్, ఏఈ మాజిద్, ఏఈ నాగరాజు, రవి, శ్రీధర్, తిరుపతి డివిజన్ అధ్యక్షులు చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.