13-09-2025 05:22:52 PM
వేములవాడ టౌన్,(విజయక్రాంతి): వేములవాడ అర్బన్ మండల. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బుర్ర శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో మండల పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది. సెప్టెంబర్ 17న జరగనున్న ప్రధాన కార్యక్రమాలు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం మరియు తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కారంగా చేపడుతున్న కార్యక్రమాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు కార్యాచరణ వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. అల్లాడి రమేష్. హాజరై గ్రామస్థాయి కార్యకర్తలపై విజయవంతంగా కార్యక్రమాలు నిర్వర్తించాల్సిన బాధ్యత ఉన్నట్లు సూచించారు.