ధర్మారం లో ట్రాఫిక్ సిఐ వినోద్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ
ధర్మారం లో ట్రాఫిక్ సిఐ వినోద్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ
13-09-2025 05:24:52 PM
మద్యం సేవించి వాహనాలు నడిపిన వాహనం యొక్క ద్రవపత్రాలు లేకపోయినా కఠిన చర్యలు
నిజామాబాద్,(విజయక్రాంతి):ధర్మారం( బి )శివారులో వాహనాలు తనిఖీ చేసిన ట్రాఫిక్ సీ ఐ.వినోద్" నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లో ధర్మారం (బి) శివారులో నిజామాబాద్- డిచ్ పల్లి ప్రధాన రహదారి అమృత గార్డెన్ ఎదుట నిజామాబాద్ ట్రాఫిక్ సీఐ.వినోద్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని వాహనదారులకు పలు సూచనలు చేశారు.కొందరి వాహనదారుల కారు అద్దాలకు అతికించిన బ్లాక్ ఫ్రేమ్ స్టిక్కర్ లను ట్రాఫిక్ పోలీసులుతొలగించారు.ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సీటు బెల్టు ధరించాలని,ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడాలని ట్రాఫిక్ సీఐ వినోద్ వాన దారులకు పలు సూచనలు చేశారు.