13-09-2025 05:13:58 PM
భారీ మొత్తంలో నిషేధ గుట్కా స్వాధీనం
హనుమకొండ (విజయక్రాంతి): నిషేధిత గుట్కా విక్రయాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు(Task Force Police) పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యానగర్‌లో టాస్క్‌ఫోర్స్ బృందం నిర్వహించిన దాడుల్లో కమలాపూర్ మండలం ఉప్పల్ కు చెందిన అకినెపల్లి వంశీధర్(32) అనే వ్యాపారి వద్ద నుంచి రూ.10,03,760 విలువైన అనార్, వి1, జే.కే, బాబా బ్లాక్, అంబర్ వంటి పలు రకాల నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితుడిని, స్వాధీనం చేసుకున్న సరుకును తదుపరి విచారణ నిమిత్తం సుబేదారి పోలీసులకు అప్పగించారు. ఈ గుట్కా దందాలో ప్రధాన పాత్రధారులుగా ఉన్న మట్టెవాడకు చెందిన కొలారియా ధీరజ్, కరీంనగర్‌కు చెందిన గాజుల అనిల్ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ఏ. మధుసూదన్ తెలిపారు. ఈ దాడుల్లో ఇన్‌స్పెక్టర్ కె.శ్రీధర్, ఎస్సై టి.వీరస్వామి, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.