13-09-2025 05:13:33 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని చర్లపల్లి శివారులోని పంట పొలాల్లో విద్యుత్ తీగలు కిందికి వంగి ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. పంట పొలాల్లో పనిచేసే రైతులకు నిత్యం ప్రాణ సంకటంగా మారాయి. విద్యుత్ తీగలు కిందికి వంగి పంట పొలాలకు దగ్గరగా వేలాడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశాలున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేయాలని రైతుల కోరుతున్నారు.