13-09-2025 05:16:40 PM
బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నపర్తి జ్ఞాన సుందర్
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల మెయిన్ రోడ్డుపై గుంతలు పడి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. ఎత్తి వేతలతో వాహనదారుల నడుము డిస్కులు దెబ్బ తిని ,నడుము నొప్పి, కొంతమందికి ప్రమాదాల బారిన పడుతున్నారని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి రోడ్డు భవనాల శాఖ మంత్రి వెంకట్ రెడ్డి ఇంజనీరింగ్ ఇన్ చీప్, కలెక్టర్ సూర్యాపేట గత నెల 25వ తారీఖున మెమోరాండం ఇవ్వగా,వెంటనే రోడ్డు మరమత్తులు చేయాలనీ ఆదేశించారు.
ఇంజనీరింగ్ ఇన్ చీప్ మోస్ట్ అర్జెంట్ కంప్లీట్ ద ప్యాచ్ వర్క్ మరియు రీపోర్టు అని ఆదేశించారు.ఈ విషయమై ఎగ్జీటివ్ ఇంజనీర్ సూర్యాపేట జిల్లా డి ఈ, ఏ ఈ సూర్యాపేట ఈ నెల 3 వ తారీఖున బహిరంగ విచారణ చేశారు. నాలుగు రోజుల్లో పని ప్రారంబం చేస్తామని చెప్పారు. నేటి వరకు కూడా రాకపోవడం బాధాకరం.ఏ రోజు ఫోన్ చేసిన రేపు చేస్తామని చెబుతున్నారు.
కానీ చేయడం లేదు. అందుకే ప్రభుత్వానికి. మరోకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే పనులు ప్రారంబించాలని కోరుకుంటూ ఆర్ & బి డిపార్ట్మెంట్ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ రోడ్డు మీద నుండి ముఖ్య మంత్రి,మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి. ఎమ్మెల్యే సామేలు. జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పలువురు స్థానికులు పాల్గొన్నారు.