13-09-2025 05:20:40 PM
వనపర్తి టౌన్: రాష్ట్రంలో అన్నదాతలు యూరియా అందిచడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి లో విఫలం చెందిందనిసేవ పక్షం రాష్ట్ర కో కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవాపక్షం 2025 పేరిట చేపట్టబోయే కార్యక్రమాలపై శనివారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీ కృష్ణ గార్డెన్స్ లో బిజెపి జిల్లా అధ్యక్షులు డి.నారాయణ అధ్యక్షతన సేవాపక్షం-2025 వనపర్తి జిల్లా స్థాయి కార్యశాల (వర్క్ షాప్) నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరైన సేవాపక్షం రాష్ట్ర కో కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 13 ఏళ్లు ముఖ్యమంత్రిగా 12 ఏళ్లుగా భారత ప్రధాన మంత్రిగా సుదీర్ఘ కాలం ప్రజాప్రతినిధిగా దేశ సేవలో నిమగ్నమై ఉన్న నరేంద్ర మోడీ జన్మదినం సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 02 వరకు సేవాపక్షం 2025 సేవా కార్యక్రమాలను విజయవంతంగా చేయాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు వారి వారి అవసరాలను బట్టి యూరియా అందిస్తుందని కానీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వానికి అధికారులకు సమన్వయం కొరవడి అన్నదాతలను సింగిల్ విండో కార్యాలయాలకు పరిమితం చేశారని ఇది కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వాతంత్ర దినోత్సవం రోజు ఎర్రకోట నుండి దేశ ప్రజలకు జీఎస్టీ తగ్గింపు బహుమానంగా ఇస్తావని ప్రకటించి నాలుగు స్లాబులను రెండు స్లాబులుగా చేసి రైతులు మహిళలు వ్యాపార వర్గాలు నిర్మాణ రంగానికి ఆటోమొబైల్ రంగానికి జీఎస్టీ తగ్గింపుతో ఆదాయం పెంచితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని మొసలి కన్నీరు కారుస్తుందని దుయ్యబట్టారు.
అనంతరం ఈ నెల 17 నుండి నిర్వహించే కార్యక్రమాలను వివరించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథి సేవపక్షం రాష్ట్ర కో కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు డి నారాయణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సబి రెడ్డి వెంకట్ రెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ రాకాసి లోకనాథ్ రెడ్డి ఓబీసీ మోర్చా రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి బి శ్రీశైలం స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా కన్వీనర్ మెంటేపల్లి పురుషోత్తం రెడ్డి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గౌని హేమారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు