calender_icon.png 23 January, 2026 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పద్మశాలీలు పుర ఎన్నికల్లో సత్తా చాటాలి

23-01-2026 12:54:06 AM

కరీంనగర్ క్రైం, జనవరి 22 (విజయ క్రాంతి): రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పద్మశాలీలు సత్తా చాటాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమి టీ చైర్మన్ వాసాల రమేష్, తెలంగాణ ప్రాం త పద్మశాలి సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మెతుకు సత్యం అన్నారు. గురువారం జిల్లా పద్మశాలి సంఘం, సంక్షేమ ట్రస్ట్ ఆధ్వర్యం లో పద్మశాలి ట్రస్ట్ భవన్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపల్ ఎన్నికల్లో పద్మశాలీలు వచ్చిన అవకాశాన్ని సద్వి నియోగం చేసుకొని బరిలో నిలవాలన్నారు.

పోటీలో ఉండే అభ్యర్థుల కోసం జిల్లా పద్మశాలి సంఘం, కోర్ కమిటీ పార్టీలకు అతీతం గా విస్తృతంగా ప్రచారం చేస్తుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఆధారంగా మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. 30 మందికి పైగా పద్మశాలీలు ఎన్నికల బరిలోకి రావడం అభినందనీయమన్నారు. వారికి జిల్లా పద్మశాలి సంఘం తోపాటు అనుబంధ సంఘాలు పూర్తి మద్దతును తెలియజేస్తుందన్నారు.

ఈ సమావేశంలో ఆడిచర్ల రాజు, జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి వోల్లాల కృ ష్ణ హరి, పోపా అధ్యక్షులు పోలు సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు గడ్డం శ్రీరాములు, యువజన సంఘం అధ్యక్షులు గుడిమల్ల శ్రీకాంత్, జిల్లా నాయకులు అల్సభద్రయ్య, మల్లికార్జున్ దేవ్, ఇప్పనపల్లి సాంబయ్య, స్వర్గం నర్సయ్య, వేముల విష్ణు, మల్లికార్జున్, జక్కని సంజీవ్, వోడ్నాల రవీందర్, వంగర ఆంజనేయులు, వేముల చంద్రశేఖర్, గజవెల్లి కనకయ్య, తెల్ల చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.