calender_icon.png 25 November, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందడమే ప్రభుత్వ లక్ష్యం..

25-11-2025 07:09:12 PM

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి..

బాన్సువాడ (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని చందూర్ మండల పరిధిలో మంగళవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్​ ఛైర్మన్ కాసుల బాలరాజ్​తో  కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా చందూర్ చెరువులో ప్రభుత్వం సరఫరా చేసిన ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు.

చేపల పెంపకదారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని వివరించారు. మేడిపల్లి గ్రామంలో రూ.11 లక్షలతో నిర్మించిన సొసైటీ గోదాంను ప్రారంభించారు. అనంతరం లక్ష్మాపూర్ గ్రామంలో రూ. 30 లక్షలతో నిర్మించిన సొసైటీ సబ్‌సెంటర్ భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు. చందూర్ మండల మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారన్నారు. గ్రామీణ ప్రజలు, రైతులు, మత్స్యకారులకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చందూర్, మోస్రా, వర్ని మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.