25-11-2025 07:06:18 PM
* ఏఎంఆర్ ఎనిమిదవ వార్షికోత్సవం..
* క్రీడా విజేతలకు వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి బహుమతుల పంపిణీ
కాటారం/మలహర్ (విజయక్రాంతి): కార్మికుల అంకితభావమే సంస్థ పురోగతికి పునాది అవుతుందని ఏఎంఆర్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఏఎంఆర్ కోల్ మైనింగ్ కంపెనీ ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా కంపెనీ ఎండి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్ల ఓసిపి ఆవరణలో అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు. తాడిచర్లలోని ఓసిపి కోల్ మైన్ లో కార్మికులకు వివిధ రంగాల్లో ఆటల పోటీలను నిర్వహించారు.
గత పదిహేను రోజులుగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు, ఉత్తమ ఉద్యోగులకు ఏ ఎం ఆర్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, సీనియర్ జనరల్ మేనేజర్ కే ఎస్ ఎన్ మూర్తిలు బహుమతులు అందజేశారు. ప్రశంసా పత్రాలను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మైన్ మేనేజర్ శ్రీనివాస్, సేఫ్టీ ఆఫీసర్ సురేష్ బాబు, ఫిట్ ఇంజనీర్ కిషన్, వెల్ఫేర్ ఆఫీసర్ రమేష్ బాబు, ఏఎంఆర్ కంపెనీ అధికారులు విశ్వ ప్రసాద్, సర్వోత్తమ్, హెచ్ఆర్ డి జి ఎం రమేష్ బాబు, సూపర్ వైజర్ బొబ్బిలి నరేష్ గౌడ్, ఉద్యోగులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.