calender_icon.png 11 September, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి

10-09-2025 10:26:39 PM

బాలికలు అన్ని అంశాల్లో రాణించాలి..

కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి..

హుజూర్ నగర్: ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యం ఎంచుకొని దాన్ని సాధించేందుకు కృషి చేయాలని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి(DSP Sridhar Reddy) అన్నారు. బుధవారం పట్టణంలోని తెలంగాణ మైనారిటీ గల్స్ కళాశాలలో మహిళల రక్షణ చట్టాలు గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీదర్ రెడ్డి మాట్లాడుతూ... పాఠశాలలో మనం ఎందుకు ఉన్నాము అనేది గుర్తుంచుకోవాలని చదువు చాలా విలువైనది ప్రపంచంలో చదువుతోనే విజ్ఞానం వెలుగుతుందన్నారు. బాగా చదివి ప్రయోజకులు కావాలి, సదుపాయాలను సద్వినియోగం చేసుకుని లక్ష్యం కోసం నిరంతరం కృషి చేయాలని అన్నారు. చెడు అలవాట్లకు లోను కావద్దు మంచి పుస్తకాలను మంచి స్నేహితులను ఏర్పాటు చేసుకోవాలి, కష్టపడి చదివి తల్లిదండ్రులకు చదువు చెప్పిన గురువులకు పాఠశాలకు మంచిపేరు తేవాలని కోరారు. బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ చరమంధ రాజు, ఎస్సై మోహన్ బాబు, సిబ్బంది, పోలీసు కళా బృందం, పాల్గొన్నారు.