calender_icon.png 11 September, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానుకోటలో రైల్వే మెగా కోచ్ మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు చేయాలి

10-09-2025 10:18:56 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో రైల్వే మెగా కోచ్ మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన 350 ఎకరాల భూమి అందుబాటులో ఉందని, రైల్వే శాఖ అధికారులు స్థల పరిశీలన జరపాలని కోరుతూ దక్షిణ మధ్య రైల్వే డిఆర్ఎమ్ ఆర్. గోపాలకృష్ణకు మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(MLA Dr. Bhukya Murali Naik) వినతి పత్రం అందజేశారు. బుధవారం దక్షిణ మధ్య రైల్వే కార్యాలయానికి వెళ్లి డిఆర్ఎంకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. మారుమూల గిరిజన ప్రాంతమైన మహబూబాబాద్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, డోర్నకల్, భద్రాచలం రోడ్, కాజీపేట రైల్వే కారిడార్ మరింత అభివృద్ధి చెందుతుందని డిఆర్ఎమ్ కు ఎమ్మెల్యే వివరించారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన స్థలానికి సంబంధించిన వివరాలను డిఆర్ఎమ్ కు ఎమ్మెల్యే అందజేశారు. ఎమ్మెల్యే వెంట జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎండి ఖలీల్, ఎడ్ల రమేష్ పాల్గొన్నారు.