calender_icon.png 7 January, 2026 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమకారుల హామీలపై స్పష్టత ఇవ్వాలి

05-01-2026 12:43:35 AM

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాసరావు

ముషీరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఛీమ శ్రీనివాస్ రావు పిలుపు మెరకు ఆదివారం మల్కాజ్‌గిరి నియోజకవర్గం పరిధిలోని అల్వాల్ ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణంలో రిలే నిరా హార దీక్షను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల సురేందర్ రెడ్డి, మల్కాజ్గిరి నియోజకవర్గం ఇంచార్జి పుట్నాల కృష్ణ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫోరం అద్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఉద్యమకారుల ఆవేదనను, ఉద్యమకారుల ఫోరం కృషిని అసెంబ్లీలో ప్రస్తావించిన బీజేపీ పక్ష నేత నిర్మల్ శాసనసభ సభ్యులు ఏలేటి మహేశ్వర రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

సానుకూలంగా స్పందించే టి పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు దన్యవాదాలు తెలియజేశారు. కానీ సానుకూల స్పందనలు కాదని, ఉద్యమకారుల హామీలపై స్పష్టమైన ప్రకటన చేసి కార్యాచరణ ప్రారంభించే వరకు ఈ రిలే నిరాహార దీక్షలు రాష్ట్రవ్యాప్తంగా నిరవధికంగా జరుగుతాయని ప్రకటించారు. మల్కాజిగిరి పార్లమెం ట్ సభ్యులు ఈటల రాజేందర్ డిల్లీ నుండి వీడియో కాల్ ద్వారా ఈ నిరాహార దీక్షకు తన సంగీభావం తెలిపారు. టియుజేఏసీ, టిపీఎస్ ఉద్యమకారులు హాజరై ఈ దీక్షకు మద్దతు తెలిపారు.

ఈ కార్యక్రమంలో దయానంద్, పుట్నాల కృష్ణ మంద శోభన్ బాబు, డోలి సుధీర్, మొకాటి రాంబాబు, కొంతం యాదిరెడ్డి, దొమ్మటి కిరణ్ కుమార్ రావు, రాజుగౌడ్, లక్ష్మణ్ యాదవ్, జగన్ యాదవ్, జ్యోతి, నస్రీన్ సుల్తానా, జ్యోతి రెడ్డి, నాగ జ్యోతి, శ్యామల, తెలంగాణ నలుమూలల నుండి వివిధ సంఘాల నాయ కులు తదితరులు పాల్గొన్నారు.