02-09-2025 12:35:54 AM
మానేర్ డ్యాం నీళ్లు కాళేశ్వరం నీళ్లెలా అవుతాయి
ఇది అమరవీరులను అవమానపరచడం కాదా
సుడా చైర్మన్,నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్, సెప్టెంబర్ 1(విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులో జరి గిన అవినీతిపై విచారణకు సీబీఐ కి అప్పజెప్పడంతో బిఆర్‌ఎస్ నాయకుల్లో వణుకు మొదలైందని ఎలాగై నా ప్రజలను గందరగోళం లో పడేయాలని డ్రామాలకు తెర లేపారని సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.మానేర్ డ్యాం నీళ్లు తీసుకొచ్చి కాళేశ్వరం జలాలు అంటూ అమరవీరుల స్తూపం పై నీళ్లు చల్లి అమరవీరులను అవమానపరిచారని అందుకే అమరవీరుల స్థూపానికి పాలాభిషేకం చేశామని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో జ రిగిన అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ అన్ని ఆధారాలు బయట పెట్టిందని కాళేశ్వరం ప్రాజెక్టులోని మిగితా బ్యారేజీలు లింక్ కెనాల్ లలో కూడా నాసిరకం నాణ్యత లోపం ఉందని స్ప ష్టంగా పేర్కొన్నదని నరేందర్ రెడ్డి అన్నారు.ఇన్నాళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆహా ఓహో అని పొగడిన బిఆర్‌ఎస్ నాయకులకు అవినీతి బండారం బయటపడుతుండడంతో డ్రామాలు మొదలుపెట్టారని నరేందర్ రెడ్డి అన్నారు.
ఎన్ని డ్రామాలు చేసినా చివరకు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై జైలుకు వెళ్ళక తప్పదని నరేందర్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో ఎండి తాజ్,కొరివి అరుణ్ కుమార్,సమద్ నవాబ్,వెన్న రాజమల్లయ్య,దండి రవీందర్, అక్బర్ అలీ,సలీం,కుర్ర పోచయ్య,వంగల విద్యాసాగర్,ఎండి చాంద్ పాషా,నెల్లి నరేష్,బషీర్,మహమ్మద్ భారీ,షభానా మహమ్మద్, అస్థాపురంరమేష్,కుంభాల రాజ్ కుమార్,ముల్కల కవిత,షెహెన్ష,అస్థాపురం తిరుమల,సుదర్శన్,ఎల్లారెడ్డి,కిరణ్ రెడ్డి,లింగమూర్తి,జమీల్ తదితరులుపాల్గొన్నారు.