calender_icon.png 4 November, 2025 | 1:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం స్పందించాలి

04-11-2025 12:07:13 AM

కామారెడ్డి, నవంబర్ 3 (విజయక్రాంతి): ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం, టీజేఎస్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు,కుంబాలక్ష్మణ్ యాదవ్ లు మాట్లాడుతూ ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల కళాశాలల యాజమాన్యాలు నిరవధిక బంద్ ని పాటించడం శోచనీయం.

ప్రభుత్వం కళాశాలల యాజమాన్యాలతో ఫలవంతమైన చర్చలు జరిపి సమస్యను పరిష్కరించి బంద్ ని నిలిపివేసి తరగతులు ప్రారంబించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ బంద్ వల్ల బడుగు,బలహీన వర్గాల విద్యార్థులే ఎక్కువ నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు,బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ విద్యార్థులే ఎక్కువగా నష్టపోతూ,తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు.

ఈ విద్యా సంవత్సరం లో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం అయ్యే సమయంలో బంద్ ని పాటీంచడం వల్ల విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారని అన్నారు.దాదాపు 8వేల కోట్ల బకాయిలు పెండింగులో ఉండడం,గతంలో ప్రభుత్వం తో జరిగిన చర్చల్లో  యాజమాన్యాలకి ఇచ్చిన మాట ప్రకారం పెండింగ్ ఫీజులు చెల్లించకపోవడం వల్ల కాలేజీలు బంద్ పాటించడం,ప్రభుత్వం స్పందించకపోవడం తో అంతిమంగా నష్టపోయేది విద్యార్థులేనని అన్నారు.

ప్రభుత్వం,కళాశాలల యాజమాన్యాలు సామరస్యంగా చర్చలు జరిపి సమస్యని జటిలం కాకుండా తరగతులి సక్రమంగా జరిగి విద్యార్థుల భవిష్యత్తు అంధకారం కాకుండా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో పవన్, రవికాంత్, రాజేందర్, సచిన్, శ్రీధర్, రక్షిత్, మోహన్, వినోద్, రాజు, బాను, వెంకట్, సాయి,అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.

బకాయిలు వెంటనే విడుదల చేయాలి

నిజామాబాద్ నవంబర్ 03 (విజయ క్రాంతి): నిజమాబాద్ జిల్లా కేంద్రం లోని స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా లో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు  తలపెట్టిన బంద్ కు ఏఐఎస్‌ఎఫ్ , ఏఐ పి ఎస్ యు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.  ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం,  ఏఐ పిఎస్ యు జిల్లా కార్యదర్శి బోడ. అనిల్ లు మాట్లాడుతు  రాష్ర్ట వ్యాప్తంగ 8500 కోట్లు పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చెయ్యాలని అన్నారు చేయకపోతే, ప్రైవేట్ యజమాన్యాలతో కలసి విద్యార్థి ఉద్యమాలు తీవ్ర రూపం దాల్చుతాయని హెచ్చరించారు.

పేద విద్యార్థులు తమ చదువులు పూర్తి చేసి పై చదువులకు వెళ్లాలంటే ప్రైవేట్ కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల చాలా మంది విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, కనీసం విడతలవారీగా అయినా బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

విద్యాశాఖ మంత్రిని ఇప్పటికీ నియమించకపోవడం సిగ్గుచేటు అని “నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేసి, విద్యార్థులు కళాశాల యాజమాన్యాల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. లేనిపక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మంత్రుల కార్యాలయాలను ముట్టడిస్తాం” అని హెచ్చరించారు. కార్యక్రమంలో శుబోధ్, కుషాల్, గోపాల్ సింగ్ ఠాగూర్, సునిల్, సుమన్ పాల్గొన్నారు