04-11-2025 12:06:50 AM
							కందుకూరు,నవంబర్ 3 (విజయక్రాంతి): టీజీఐఐసికి భూములను తీసుకొని ఎకరాకు 82 లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.సోమవారం మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో సర్వేనెంబర్ 38,162 సర్వే నంబర్లు 562 ఎకరాలకు భూసేకరణకు సంబంధించి సంప్రదింపుల కమిటీ సమావేశం కందుకూరు ఆర్డీవో ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈసమావేశంలో రైతులు నష్టపరిహారం గురించి ఆర్డీవోతో చర్చించిన తర్వాత 82 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఆర్డిఓ నిర్ణయించడం జరిగింది.అలాగే ఎకరాకు 121 గజాల చొప్పున ప్లాటు కూడ ఇవ్వాలని నిర్ణయించారు.భూమిలో ఉన్న చెట్లు ఇతర కట్టడాలకు సంబంధించిన పరిహారాన్ని కూడ ఇవ్వడం జరుగుతుందని ఆర్డిఓ తెలియజేశారు.ఈ సమావేశంలో తాసిల్దార్ గోపాల్ మరియు టిజిఐఐసి డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రసాద్,ఆర్డిఓ ఆఫీస్ డిప్యూటీ తాసిల్దార్ రాజు పాల్గొన్నారు.