04-11-2025 12:08:07 AM
							ఇబ్రహీంపట్నం, నవంబర్ 03: అబ్దుల్లాపూర్ మెట్టు మండలం, మజీద్ పూర్ (పీర్లగూడెం) గ్రామానికి చెందిన మారగోని మనేమ్మ భర్త యాదయ్య అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. కాగా మారగోని శ్రీకాంత్ ద్వారా విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టిపిసిసి సభ్యులు, ఆదిభట్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ర్ట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 2.50 లక్షల ఎల్‌ఓసి మంజూరు చేయించి, వారి కుమారుడైన శ్రీకాంత్ కు అందజేయడం జరిగింది.