28-10-2025 08:06:51 PM
హనుమకొండ (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో నవంబర్ 8, 9 తేదీలలో జాగృతి జనం బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాగృతి రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు మారేపల్లి మాధవి తెలిపారు. మంగళవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో జిల్లా అధ్యక్షులు శ్రీశైలం అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మాధవి మాట్లాడుతూ పవిత్ర పుణ్యస్థలాలు వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి, భద్రకాళి దేవాలయంను జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత సందర్శిస్తారని తెలియజేశారు. ఆదివాసి జాగృతి రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు, మాట్లాడుతూ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లాలోని మేధావులు, ప్రొఫెసర్లు, న్యాయవాదులు, డాక్టర్లు, ఇంజనీర్లు, జర్నలిస్టులు కుల ప్రజా సంఘాల నేతలను కలిసి జాగృతి జన బాట కార్యక్రమంలో మమేకం కావాలని కోరారు. సామాజిక తెలంగాణ సాధన దిశగా కవితతో చర్చ ఉండబోతుందన్నారు.
జాగృతి రాష్ట్ర అధికార ప్రతి నిధి నలమాస శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని, బీసీలకు 42% రిజర్వేషన్ లను అమలు చేయటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. జాగృతి జిల్లా అధ్యక్షులు శ్రీశైలం మాట్లాడుతూ ఎక్కడైతే పౌర సమాజం అన్యాయానికి అనిచివేతకు గురవుతుందో, అక్కడ కమ్యూనిస్టులు పుట్టుకొస్తారని, అలాగే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతు న్న అన్యాయాన్ని ఎదురుకొనేందుకే తెలంగాణ జాగృతి ఆవిర్భవించిందని పేర్కొన్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాలో నవంబర్ 8,9 తేదీలలో జరిగే జాగృతి జనం బాటలో సబ్బండ వర్గాలు మమేకం కావాలని కోరారు. అనంతరం జాగృతి జనం బాట వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి యువజన విభాగం అధికార ప్రతినిధి జున్న రాజు యాదవ్, వరంగల్ మహిళా అధ్యక్షురాలు సూకల రాణి, కూతాడి కుమారస్వామి, ఓని సదానంద, కేమసారం రమేష్, శ్రుతిజ్, మల్లేష్, సంతోష్, భరత్, కిషోర్, మంజుల, స్వాతి, సన్నీ పాల్గొన్నారు.