28-10-2025 08:07:22 PM
విద్యార్థి నాయకుల అరెస్ట్
ఘట్ కేసర్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు మంగళవారం పలు కళాశాలలో విద్యార్థులతో కలిసి ఘట్ కేసర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించిన
8500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్ మెంట్ స్కాలర్షిప్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించే వరకు ధర్నా విరమించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల ధర్నాతో వాహనాలు నిలిచిపోయి అంతరాయం కలగడంతో స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని ధర్నా చేస్తున్న విద్యార్థులను చెదరగొట్టి పోలీస్ స్టేషన్ కు తరలించారు.