28-10-2025 08:08:10 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): నవంబర్ 26న ఢిల్లీలో జరగనున్న రాజ్యాంగ హక్కు సాధన సభను విజయవంతం చేయాలని జాతీయ మాల మహానాడు మేడ్చల్ జిల్లా కన్వీనర్ గుజ్జుక పరశురాం పిలుపునిచ్చారు. మంగళవారం ఘట్ కేసర్ పట్టణంలో రాజ్యాంగ హక్కుల సాధన సభకు సంబంధించిన వాల్ పోస్టర్ ను జాతీయ మాల మహానాడు మేడ్చల్ జిల్లా కన్వీనర్ పరశురాం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. హలో మాల చలో ఢిల్లీ రాజ్యాంగ హక్కుల సాధన సభ నవంబర్ 26న జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలో జరగనుంది.
రాజ్యాంగ ఆమోద దినోత్సవ సందర్భంగా జాతీయ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివెళ్లి హలో మాల చలో ఢిల్లీ సభను విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్క మాల బిడ్డ ఢిల్లీ నడిబొడ్డున జరిగే సభకు మాలల అస్తిత్వం ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేలా పెద్ద ఎత్తున తరలి వెళ్లి విజయవంతం చేయాలని జిల్లా కన్వీనర్ పరుశురాం కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పొడిగం ఆంజనేయులు, మున్సిపల్ అధ్యక్షులు ఎజ్జల రఘు, నాయకులు పడిగం ప్రవీణ్, మేకల సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.