calender_icon.png 28 October, 2025 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇల్లు వేగవంతంగా పూర్తి చేయాలి

28-10-2025 08:11:17 PM

శంకర్ పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్..

అధికారులు సమీక్ష చేస్తుంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శులు

శంకర్ పల్లి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా చేపట్టాలని శంకర్పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్ గ్రామపంచాయతీ కార్యదర్శులకు సూచించారు. శంకర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం అధికారులు పంచాయతీ కార్యదర్శులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో వెంకయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎన్ని ఇల్లు మంజూరయ్యాయి? ఎన్ని ప్రారంభించారు? ఇంకా ప్రారంభం కానీ ఇండ్లను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మంజూరైన లబ్ధిదారులకు మూడు విడతలుగా బిల్లులు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. పారిశుద్ధ్య పనులు, ఉపాధి హామీ పథకం పనులు, మంచినీటి సమస్య, ప్లాస్టిక్ నిర్మూలన తదితర సమస్యలపై పంచాయతీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి గిరిరాజ్, ఏపీఎం రవీందర్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

సమావేశంలో విచ్చలవిడిగా మొబైల్ ఫోన్లో వినియోగం 

ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించేందుకోసం నిర్వహించే సమీక్ష సమావేశంలో సాక్షాత్తు అధికారులే మొబైల్ ఫోన్లలో లీనమవ్వడం గమనార్హం. సమావేశాలలో మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవాలని సూచించే అధికారులే మొబైల్ ఫోన్లో లీనం అవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమీక్ష సమావేశంలో మొబైల్ ఫోన్లలో బిజీబిజీగా ఉండే అధికారులు ఇక అధికారులు చెప్పే సూచనలు ఏమి వింటారు? గ్రామాలలో ప్రభుత్వ పథకాల గురించి ఎంత మేరకు అమలు చేస్తారో ఈ చిత్రం చూస్తేనే అర్థమవుతుంది.