calender_icon.png 14 May, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ స్థాయిలో సంపద సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యం

14-05-2025 12:29:20 AM

- రూ.90 కోట్లతో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపనలు

- సంగారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం

- రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి దామోదరం రాజనర్సింహ 

సంగారెడ్డి, మే 13(విజయక్రాంతి):గ్రామీ ణ ప్రాంతాల్లో సందప సృష్టించడమే ప్రభు త్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ్మ తెలిపా రు. మంగళవారం నాడు సంగారెడ్డి నియోజక వర్గంలో రహదారుల అభివృద్ధి పనుల కు రూ.90 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా సంగారెడ్డి ఐబీ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిగ్నల్ వ్యవ స్థను ప్రారంభం చేశారు. అలాగే పోతిరెడ్డిపల్లి (ఎన్హెచ్ 65) రోడ్డు నుంచి భూలక్ష్మమ్మ, కలివేముల రోడ్డు,సదాశివపేట మండలం ఆత్మకూరు నుండి సింగూరు వరకు, కొండాపూర్ మండలంలోని మరేపల్లి నుంచి సీత్రం కుంటకు గల వివిధ బీటీ రోడ్డు నిర్మాణాలకు ఎంపీ రఘునందన్ రావు,  జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు,  ఎమ్మెల్సీ అంజిరెడ్డి,  టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మం త్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ 15 గ్రామాల్లో రోడ్ల అనుసంధానంతో గ్రా మస్థాయిలో సంపదను  సృష్టించడమే ప్ర భుత్వ లక్ష్యమన్నారు. సంగారెడ్డి నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామ న్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి బలమైన రవాణా వ్యవస్థ అవసరం అని ఇందు లో భాగంగా గ్రామాల మధ్య రోడ్లను అనుసంధానించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవ స్థలో బలోపేతం అవుతుందని చెప్పారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు  మాట్లాడుతూ గ్రామాల మధ్య సరైన రవా ణా మౌలిక సదుపాయాలు ఉంటే గ్రామీణ ప్రజల జీవనోపాధిలో గణనీయమైన మా ర్పు వస్తుందని పేర్కొన్నారు. టిజిఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ సం గారెడ్డి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తయారు చేస్తామన్నారు. ప్రభుత్వం గ్రామా ల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తోందని, త్వరితగతిన ఈ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, సిడిసి చైర్మన్ రాంరెడ్డి, ఆర్డిఓ రవీందర్ రెడ్డి, నేషనల్ హైవే అథారిటీ   అధికారులు, పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులుపాల్గొన్నారు.