calender_icon.png 25 November, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలను శక్తివంతులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం

25-11-2025 12:00:00 AM

ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్

ధర్మపురి,నవంబర్24 (విజయక్రాంతి): మహిళలను శక్తివంతులుగా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమనీ, మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తుందనీ తెలంగాణ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఎండపల్లి మండలం రాజారాoపల్లి ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ తో కలిసి మహిళలకు చీ రలను పంపిణీ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జ యంతి సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించారన్నా రు. రాష్ట్రంలోని సుమారు కోటి మంది మ హిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు నాణ్యమైన చేనేత చీరలను ఉచితంగా అందించడమే ఈ పథకం ముఖ్య లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

జగిత్యాల జిల్లాకు తొలి విడతలో 1,89,715 చీరలు వచ్చినట్లు వివరించారు. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకు చీర అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.మహిళా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ క్యాం టీన్లు, మహిళాసంఘాల కోసం రుణమాఫీ తదితర పథకాలను అమలు చేస్తోందని ఆయన వివరించారు. చీరల పంపిణీలో ఎటువంటి అవకతవకలు జరగకుండా పూర్తి పారదర్శకతతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూధన్, తహసీల్దార్ అడ్ల అనిల్ కుమార్, ఎంపీడీవో కరుణాకర్, ఏఎంసీ చైర్ పర్సన్ గుండేటి గోపిక జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాటిపర్తి శైలందర్ రెడ్డి, సీనియర్ నాయకులు మద్ధుల గోపాల్ రెడ్డి, గండ్ర శ్రీకాంత్ రావు, మేరుగు నరేష్ గౌడ్, గొల్లపల్లి మల్లేష్ గౌడ్, మాజీ సర్పంచ్ గెల్లు చంద్ర శేఖర్ యాదవ్, గుమ్ముల వెంకటేష్, మహిళా సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్య లో మహిళలుపాల్గొన్నారు.