calender_icon.png 26 November, 2025 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారం జాతర భక్తుల కోసం కాటారం, మహాముత్తారం రోడ్డుకు నిధులు మంజూరు

25-11-2025 10:58:51 PM

మంత్రి శ్రీధర్ బాబు కృషి తో రూ. 12 కోట్లతో రోడ్డు కు మరమత్తులు 

రూ. 8 కోట్లతో శంకరంపల్లి- రుద్రారం వరకు రోడ్డు నిర్మాణం

మంథని (విజయక్రాంతి): మేడారం సమ్మక్క- సారక్క జాతర సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మంథని నియోజకవర్గంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం నుండి మహాముత్తారం మండలంలోని యామాన్ పల్లి వరకు, ముకునూరు, కనుకునూరు, మేడారం రోడ్డు మరమ్మత్తుల కోసం, అలాగే బ్రిడ్జి అప్రోచ్ రోడ్ల కోసం రూ. 12 కోట్ల నిధులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంజూరు చేశారు.

రూ. 8 కోట్లతో శంకరంపల్లి నుండి రుద్రారం వరకు రోడ్డు నిర్మాణం

కాటారం మండలంలోని శంకరంపల్లి గ్రామం నుండి రుద్రారం గ్రామం వరకు 3 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 8 కోట్లతో మంత్రి మంజూరు చేశారు. కాటారం మీదుగా వెళ్లే సమ్మక్క- సారక్క భక్తులకు ఇబ్బందులు లేకుండా మేడారం జాతర రోడ్డు మరమ్మత్తులకు వెంటనే నిధులు మంజూరు చేసిన మంత్రి శ్రీధర్ బాబు కు కాటారం మండల, మహా ముత్తారం మండలం ప్రజలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.