25-11-2025 10:35:57 PM
కొమురవెల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానానికి ఉత్సవ కమిటీని నియమిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్సవ కమిటీ బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతుంది. కమిటీ పదవి కాలం డిసెంబర్ 10, 2025 నుంచి 21 మార్చ్ 2026 వరకు కొనసాగుతుంది. ముణ్నెళ్ల పాటు జాతర విజయవంతం కావడం కోసం నియమించారు. కమిటీ సభ్యులుగా గంగం నరసింహారెడ్డి, చికిరి కొమురయ్య, మెరుగు నరేష్ గౌడ్, పల్లె మహేష్, వంగరి వరలక్ష్మి, నంగునూరి సత్యనారాయణ, కాటం శ్రీనివాస్, సార్ల లింగం, పయ్యావుల ప్రవీణ్ యాదవ్, అలగళ్ల మల్లేశం, బొచ్చు ఎల్లయ్య, జి రవిలను నియమించారు.