calender_icon.png 26 November, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో డివిజన్ లోని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీత..

25-11-2025 10:48:45 PM

గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్

ముషీరాబాద్ (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ లోని సమస్యలను పరిష్కరించే క్రమంలో  జిహెచ్‌ఎంసి అధికారులు అవలంభిస్తున్న సోమరితనం, డివిజన్ల అభివృద్ధి పై ఇప్పటివరకు ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యవైఖరి పై గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ మంగళవారం జిహెచ్‌ఎంసి మేయర్ సమక్షంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో  ప్రభుత్వాన్ని నిలదీశారు. డివిజన్ లో పారిశ్యుద్ధ సమస్య, పూర్తిగా దెబ్బతిన్న రోడ్లు, వెలగని స్ట్రీట్ లైట్స్ తో అంధకారంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఎంటమోలజీ వ్యవస్థ పూర్తిగా కనుమరుగైందని,  వారానికి ఒకసారి వచ్చే ఫాగ్ సిబ్బంది విధులకు గైర్హాజరుతో బస్తీలు, కాలనీలలో ప్రజలు దోమల భారిన పడి విషజ్వరాలు గురవుతున్నారన్నారు.

ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లుగా వారి సమస్యలు పరిష్కరించే భాధ్యత తమతో పాటు ప్రభుత్వానికి  వుంటుందని,  పనిచేయని అధికారుల పట్ల చర్యలు తీసుకొని డివిజన్ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ తన గళాన్ని వినిపించారు. కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం తరపున మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రకటించిన డివిజన్ల అభివృద్ధి కొరకు150 డివిజన్లోలో ప్రతి డివిజన్ కు 2 కోట్ల నిధుల కేటాయింపును స్వాగతిస్తున్నామన్నమన్నారు. ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేసి ప్రజల సమస్యల నిర్మూలనకు, డివిజన్ అభివృద్ధికి నిధులు ఉపయోగకరంగా ఉండేందుకు  జిహెచ్‌ఎంసి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సమావేశంలో సూచించినట్లు పేర్కొన్నారు.