calender_icon.png 26 November, 2025 | 12:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబిటస్ వరల్డ్ స్కూల్ షేడ్స్

25-11-2025 12:00:00 AM

బౌరంపేటలో వార్షికోత్సవం 

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 24 (విజయక్రాంతి): బాచుపల్లి బౌరంపేట్‌లోని అంబిటస్ వరల్డ్ స్కూల్‌లో ఈ నెల 23న షేడ్స్ పేరుతో పాఠశాల వార్షికోత్సవం వైభవంగా జరిగింది. ప్రధాన అతిథిగా హాజరైన డీసీపీ చెన్నూరి రూపేష్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొదటగా ఓపస్ గంధర్వ, సంస్కృతి  సంస్కారం ప్రదర్శనలు ఆహ్వానితులను రంజింప చేశాయి.

ఖండాంతర సంస్కృతులను ప్రతిబింబించే ప్రత్యేక నృత్యాలు, పాటలు సందర్శకులను మంత్రముగ్ధులను చేశాయి. భారతదేశం నుండి దక్షిణాఫ్రికా వరకు, జర్మనీ నుండి జపాన్ వర కు, అలాగే బ్రెజిల్, స్పెయిన్, ఫిన్లాండ్, ఫ్రా న్స్, గ్రీస్, ఇటలీ, సౌత్ కొరి యా, అమెరికా వంటి పలు దేశాల సంప్రదాయాలు చిన్నారుల అద్భుత నృత్యాలు, హావభావాలు, శ్రావ్యమైన పాటల రూపంలో కన్నులపండువగా మారాయి.

స్కూల్ ప్రధానోపాధ్యాయు రాలు డాక్టర్ మోటూరి భార్గ వి పాఠశాల ప్రగతిని వివరిస్తూ వార్షిక నివేదికను సమర్పించారు. అనంతరం అంబిటస్ కిండర్ వరల్డ్ ప్రధానోపాధ్యాయురాలు సుష్మ, అకాడమిక్ హెడ్ డాక్టర్ అనుభూతి శుక్లా అం తర్జాతీయ విద్యావిధానం, పాఠ్య అంశాలపై ప్రసంగించారు. చెన్నూరి రూపే ష్..  స్కూల్ విద్యార్థుల ప్రదర్శనలను ప్రశంసించారు.