calender_icon.png 26 November, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42 శాతం రిజర్వేషన్లు ప్రకటించేంత వరకు పోరాటం..

25-11-2025 10:29:23 PM

కలెక్టరేట్ ఎదుట బీసీ సంఘాల ఆందోళన..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిక్కాల దత్తు డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు ప్రకటించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ విషయమై మంగళవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట బీసీల పోరాట దీక్ష చేపట్టారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో 42 శాతం రిజర్వేషన్లు పెంచడానికి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి, 9వ షెడ్యూల్లో చేర్చాలని అద్యక్షుడు దత్తు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కలాల శ్రీనివాస్, గౌరవాధ్యక్షులు నర్సాగౌడ్, నాయకుల అంజు, అశోక్, శివయ్య, విజయ్, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.