25-11-2025 12:00:00 AM
కొండాపూర్‌లో ఏర్పాటు చేసిన నారాయణ గ్రూప్
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 24 (విజయక్రాంతి): ఆసియాలోనే అతిపెద్ద విద్యాసంస్థల్లో ఒకటైన నారాయణ గ్రూప్, తమ అత్యంత ప్రతిష్టాత్మకమైన మరో నూతన విద్యసంస్థ ’ది వన్ స్కూల్’ ప్రారంభాన్ని హైదరాబాద్‌లో ఘనంగా ప్రకటిం చింది. విద్యార్థుల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ స్కూల్ ఆధునిక, సమగ్ర విద్యా విధానాలతో విద్యార్థులను ప్రపంచ స్థాయి నాయకులుగా మార్చబోతోంది.
నారాయణ ది వన్ స్కూల్ ప్రారంభోత్సవ సందర్భంగా నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డా పి. సింధూర నారాయణ మాట్లాడుతూ.. ‘ఈ రోజుల్లో విద్యార్థులు కేవలం ఎక్కువ మార్కు లు సాధించడం మాత్రమే చాలదని అభిప్రాయపడ్డారు. అంతకు మించి విమర్శనాత్మక ఆలోచన, వ్యక్తిత్వ వికాసం, సామాజిక జీవన నైపుణ్యాలు అవసరమన్నారు. ఈ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ’ది వన్ స్కూల్’ ని రూపొందించామన్నారు.
కొండాపూర్‌లో ఏర్పాటు చేసిన మొదటి ప్రపంచ స్థాయి క్యాంపస్ సేవలు 2026--27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ పాఠశాల ఇంటర్నేషనల్ బాకలారియేట్ కరిక్యులమ్ను అనుసరిస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఫౌండింగ్ బ్యాచ్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని తెలిపారు.