calender_icon.png 11 July, 2025 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్షన్లపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి

11-07-2025 12:27:41 AM

వీహెచ్పీహెచ్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ళ జంగయ్య 

 యాచారం జులై 10 :కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో పెన్షన్లపై ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని విహెచ్పిహెచ్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ళ జంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం విహెచ్పిఎస్ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గురువారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.వికలాంగుల 6 వేలకు వృద్ధులు వితంతువుల చేయూత పెన్షన్ 4 వేలకు పెంచాలని కాంగ్రెస్ తమ మేనిఫెస్టో పెన్షన్ పై ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని కోరారు. పల్లెల్లో అన్ని అర్హతలు ఉండి పెన్షన్లు రాక వికలాంగులు, వృద్ధులు అనేక అవస్థలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని కోరారు.

కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు యాచారం జంగయ్య, ఎమ్మార్పీఎస్ యాచారం మండలం ఇన్చార్జి బోడ ముత్యాలు మాదిగ,ఇబ్రహీంపట్నం యాచారం మంచాల ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు జుట్టు సతీష్ మాదిగ, మూలి మహేష్ మాదిగ, పల్నాటి సుధాకర్ మాదిగ, విహెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గువ్వల యాదయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ము రాములు, ముక్కెర పాండు, యాచారం మండల అధ్యక్షులు డేరంగుల ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.