calender_icon.png 11 July, 2025 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చోరీ చేసిన బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం!

11-07-2025 12:27:11 AM

ఇద్దరు యువకుల మృతి

తిమ్మాపూర్, జూలై 10: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ప్రమాదానికి గురైన బైక్ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గౌరారంలో చోరీకి గురి అయింది. చోరీ చేసిన బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్‌ఎండి ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ కథనం ప్రకారం..

బెజ్జంకి మండలానికి చెందిన కోడూరి భానుప్రసాద్ (19), గన్నేరువరం మండలం చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన బామండ్ల నరేష్ (18) ఇద్దరూ కలిసి బైక్‌పై కరీంనగర్ నుంచి బెజ్జంకి వైపు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బెజ్జంకి మండలం గౌరారంలో ఇటీవల పల్సర్ చోరీకి గురైన బైక్, మృతులు వాడిన బైక్ ఒకటేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.