calender_icon.png 19 November, 2025 | 9:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలి

19-11-2025 08:18:56 PM

ధర్మారెడ్డి గ్రామ రైతులు చూపిన సహకారాన్ని జిల్లా కలెక్టర్ ప్రశంసించారు

రికార్డు స్థాయిలో పనితీరును ప్రదర్శించి జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలబెట్టడంలో ముఖ్య పాత్ర

ఐకేపీసీసీ ఇన్ఛార్జి కొమ్మ దత్తు, కేంద్ర సిబ్బంది, మహిళా సమాఖ్య కమిటీ సభ్యులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గ నాగిరెడ్డిపేట మండలంలోని ధర్మారెడ్డి గ్రామంలో ధాన్యం విక్రయాలను పూర్తి చేయడంలో ఇందిరా కాంతి పథకం ద్వారా, ప్రభుత్వం పెట్టిన, నిబద్దనను ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలం ధర్మ రెడ్డి గ్రామంలో ఇందిరా గాంధీ పథకంలో సీసీగా విధులు నిర్వహిస్తున్న కొమ్మ దత్తు ఒక నెలలోనే ఆ గ్రామంలోని, రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వానికి సరఫరా చేయడంలో ఆయన కృషి చేశారని ఆ గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు, ఆసస్ సంగ్వాన్ కు , బుధవారం జిల్లా పరిపాలన అధికారి కార్యాలయంలో గ్రామస్తులు ఐకెపి అధికారి దత్తు సేవలను జిల్లా కలెక్టర్ కు నేరుగా వివరించడంతో, ఆయన సేవలు పట్ల జిల్లా కలెక్టర్ గ్రామస్తులు ముందు సిసి దత్తును అభినందించారు.

ఇందిరా క్రాంతి పథకం (Indira Kranti scheme) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా వేగంగా ధాన్యం సేకరణ జరగడం, రైతుల వద్ద నుంచి ఒక గింజ కూడా నష్టపోకుండా మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయడంపై రైతులు (Farmers) సంతృప్తి వ్యక్తం చేశారు. సకాలంలో చెల్లింపులు రావడంతో తమకు పెద్ద ఉపశమనంగా మారిందని వారు పేర్కొన్నారు.ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడంలో ధర్మారెడ్డి గ్రామ రైతులు చూపిన సహకారాన్ని జిల్లా కలెక్టర్ ప్రశంసించారు. రికార్డు స్థాయిలో పనితీరును ప్రదర్శించి జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలబెట్టడంలో ముఖ్య పాత్ర పోషించిన ఐకేపీసీసీ ఇన్ఛార్జి కొమ్మ దత్తు, కేంద్ర సిబ్బంది, మహిళా సమాఖ్య కమిటీ సభ్యులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, ఏపీఎం రాంనారాయణ గౌడ్, రైతులు నారాయణ, దేవయ్య, సాయిబాబా, నారాయణ తదితరులు పాల్గొన్నారు.