calender_icon.png 19 November, 2025 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిక్షణ కార్యక్రమం

19-11-2025 08:09:13 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకు(కెడిసిసి బ్యాంకు) ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్ పి ఓ) సామర్థ్యవృద్ధి, డిజిటల్ ఆధునికీకరణ, వ్యాపారాభివృద్ధిపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో ప్రధాన శిక్షకులుగా శ్రీనివాస్ భూసారపు, గ్లాన్సా సొల్యూషన్స్ సీఈఓ నరేష్, టెక్నాలజీ నిపుణులు కిరణ్ కుమార్ పాల్గొని ఎఫ్ పి ఓ రిజిస్ట్రేషన్, ఫార్మ్-ఆన్‌లైన్ వినియోగం, మార్కెట్ లింకేజ్, వ్యాపార అవకాశాల రూపకల్పన, ఫ్యాక్స్ ప్రాంతీయ వ్యాపార విస్తరణ అవకాశాలపై చాలా విపులంగా చర్చించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా సహకార అధికారి రామానుజార్యులు అధ్యక్షత వహించడం జరిగింది. శిక్షణలో తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్, ఎన్ సి డి సి, నాబార్డ్ జిల్లా అభివృద్ధి మేనేజర్(డిడిఎం) జయప్రకాశ్, జిల్లా సహకార శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎఫ్పిఓల కోసం ఎల్ఎంఎస్, ఎంఐఎస్, డిజిటల్ డాక్యుమెంటేషన్, సభ్యుల వ్యవస్థీకరణ, ఫైనాన్షియల్ మానిటరింగ్, వర్క్‌ఫ్లో ఆటోమేషన్ వంటి అంశాలను నిపుణులు వివరించారు. ముఖ్యంగా సిబిబిఓ అధికారి వెంకటేశ్వర్లు ఎఫ్ పి ఓ ల నిర్వహణ, నిధుల వినియోగం, ప్రభుత్వ పథకాల అమలు, మార్కెట్ అనుసంధానం వంటి కీలక అంశాలపై మార్గదర్శకాలు అందింస్తు, కెడిసిసి బ్యాంకు నేతృత్వంలో నాబార్డ్, ఎన్‌సీడీసీ, తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ వంటి సంస్థల మద్దతుతో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేసి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత శక్తివంతం చేయడంలో ఈ శిక్షణ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.