calender_icon.png 19 November, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవ తరగతి విద్యార్థినులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ

19-11-2025 08:26:41 PM

మాక్లూర్: తమ సమాఖ్య తరపున బుధవారం మాక్లూర్ లోని కస్తూరిబా బాలికల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 47 మంది బాలికలకు ఉచితంగా స్టడీ మెటీరియల్ తో పాటు పెన్నులు కూడా అందించడం జరిగిందని శ్రీ కావ్య విద్యా విషయక సమాఖ్య వ్యవస్థాపకులు జి మధుసూదన్ రావు అన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రావు అన్ని సబ్జెక్టులలో అవగాహన, మెలకువలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందంతో పాటు తపాలా శాఖ విశ్రాంత ఉద్యోగులు జి భూపతిరెడ్డి, ఎన్ లింగం, సామాజిక కార్యకర్త శ్రీనివాస్ పాల్గొన్నారు. కార్యక్రమంలో మెటీరియల్ తో పాటు చక్కటి అవగాహన కల్పించినందుకు విద్యార్థినిలు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.