calender_icon.png 4 May, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా పెద్దమ్మ పెద్దిరాజుల కల్యాణం

03-05-2025 12:00:00 AM

దౌల్తాబాద్, మే 2: దౌల్తాబాద్ మండ లం తిరుమలాపూర్ గ్రామంలో పెద్దమ్మ ఆలయంలో కల్యాణ మహోత్సవాన్ని నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. శుక్రవా రం పెద్దమ్మ జాతరలో భాగంగా ఆలయంలోని పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణంను అంగరంగ వైభవంగా జరిపించారు. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వాహకులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ముదిరాజులు అధి క సంఖ్యలో పా ల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 

ఉత్సవాల్లో పాల్గొన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, ఎమ్మెల్యే

పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవంలో శుక్రవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేసి, అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నా రు. ఆలయానికి సంబంధించిన మినీ ఫంక్ష న్ హాల్ ను ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల తాజా మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.