calender_icon.png 4 May, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా శిక్షణ

03-05-2025 12:00:00 AM

రామాయంపేట, మే 2 : రాష్ట్ర వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయం, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యవసాయ డివిజన్ పరిధిలో గల సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు వ్యవసాయ సంబంధ వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది.

ఇందులో భాగంగా ఈనెల 5వ తేదీ నుండి ఆరు వారాలపాటు జరిగేటువంటి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం, రైతులకు ప్రత్యేకమైన గుర్తింపు నంబర్ను అందజేసేటువంటి రైతు రిజిస్ట్రేషన్ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమం రామాయంపేట రైతు వేదిక నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డివిజన్ పరిధిలో గల నిజాంపేట్, నార్సింగి ,రామయంపేట్ , చేగుంట మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు పాల్గొనడంజరిగింది.