calender_icon.png 7 October, 2025 | 5:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని ధర్మాల్లో కన్నా గొప్పది.. హిందూ ధర్మం

07-10-2025 12:00:00 AM

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ 

నిజామాబాద్, అక్టోబర్ 6 (విజయ క్రాంతి): పురాతన ఆలయాల పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని పురాతన ఆలయ లను కాపాడే అందుకు ప్రతి ఒక్కరూ ముందు కు రావాలని  నిజామాబాద్ అర్బన్  ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణఅన్నారు. పురాతన ఆలయాలు వాటి చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.నగరంలోని గాజుల్ పేట్ లో చిలుకల చిన్నమ్మ ఆలయ నిర్మాణం సందర్భంగా ఉగ్రహ పునప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ఈ నెల 4 నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు.చివరి రోజు మహాయజ్ఞం కుంకుమార్చన జరిగింది.విజయ్ కిసాన్ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు  కార్యక్రమంలో  ఆర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.పురాతన గ్రామ దేవతలను పూజించడం హిందూ  సాంప్రదాయంలో ఒక భాగమని అన్నారు.ప్రధాని మోడీపాలనలో దేశం లో కొత్త కొత్త ఆలయాలు నిర్మింపబడుతున్నాయని గుర్తు చేశారు.  బలయోగి పిట్ల కృష్ణ మహరాజ్  కాంగ్రెస్ నాయకులు రాంభూపాల్ నరాల రత్నాకర్  బాలకిషన్ ఆలయ కమిటీ ప్రతినిధులు రాజు గంగా ప్రసాద్ ,ప్రవీణ్ గంగాధర్ శైలందర్ లింబాద్రి చక్రధర్ తదితరులు పాల్గొన్నారు