07-10-2025 12:00:00 AM
కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన
నల్లగొండ రూరల్, అక్టోబర్ 6: బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి డిమాండ్ చేస్తూ సోమవారం కేవీపీ ఎస్, విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు గేటు వద్ద కలెక్టర్ కారుని అడ్డగించడంతో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వారి సమస్యలను విని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
SC, ST విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడం వలన వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ కేవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు.విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందనీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేసి, విద్యార్థులను తిరిగి ప్రైవేట్ స్కూల్స్లో చేర్పించాలి అని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 20,038 స్కూల్స్లో 23 వేలమంది SC విద్యార్థులు, 7 వేలమంది ST విద్యార్థులు బకాయిలు చెల్లించకపోవడంతో స్కూల్ యాజమాన్యం వారిని బయటకు పంపిందని తెలిపారు.ప్రైవేట్ స్కూల్ యజమానులు కూడా పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఎటువంటి స్పందన రాలేదన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి విద్యార్థుల సమస్యలపై స్పందించి, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంతో చర్చించి విద్యార్థులను స్కూళ్లలో, హాస్టళ్ళలో చేర్చే చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ నాయకులు కార్తీక్, మామిడి జగన్, స్వామి, గాదె నర్సింహ, శోభన్, పేరుమల్ల సాహితి, అరుణ, రాజేశ్వరి, లక్ష్మి, సోమని, శ్యామ్, నరేష్, నామ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.