calender_icon.png 15 May, 2025 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదల ఆరోగ్యమే మా లక్ష్యం

15-05-2025 12:51:07 AM

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు   రాజేంద్ర ప్రసాద్ యాదవ్

పెబ్బేరు,  మే 14: పేద ప్రజల సంక్షేమం తో పాటు వారి ఆరోగ్య సమస్యలు పరిష్కారం చేయటమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధా న లక్ష్యం అని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 12 మంది బాధితులకు 2 లక్షల 78వేల 5 వందల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశా రు.

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి కృషి తో మంజూరు చేసారని తెలిపారు. పెబ్బేరు సింగిల్ విండో కా ర్యాలయంలో చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు మ ణ్యం, ఎండి ముస్తాఖ్, చంద్రశేఖర్ నాయు డు, ఆనంద్ సాగర్, ఎల్ల స్వామి, విజయ్ గౌడ్, విజయ వర్దన్ గౌడ్, బొట్టుశీను,, యండి ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.