calender_icon.png 17 May, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయాలి

17-05-2025 04:30:30 PM

బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్మల రెడ్డి..

హుజురాబాద్ (విజయక్రాంతి): హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయాలని బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల నిర్మల రెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని శిశు మందిర్ లో శనివారం బిజెపి పట్టణ అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో హిందూ ఏక్తా యాత్ర, తిరంగా యాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మల రెడ్డి మాట్లాడుతూ... ఈనెల 22వ తేదీన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో కరీంనగర్లో నిర్వహించే యాత్రలను హిందువులంతా ఏకమై విజయవంతం చేయాలని కోరారు.

రాష్ట్రంలో హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని హిందువులంతా సంగటితమై హిందువుల శక్తి చాటాలని పిలుపునిచ్చారు. ఈనెల 20వ తేదీన హుజరాబాద్ లో తిరంగా యాత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి యువకులు విద్యార్థులు రైతులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, అన్ని పార్టీల నాయకులు, ప్రజలు తరలివచ్చి దేశభక్తిని చాటుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, రావుల వేణు, తూముల శ్రీనివాస్, గంగిశెట్టి రాజు, అంకటి వాసు, నరాల రాజశేఖర్, తిప్ప బత్తిని రాజు, రమేష్, విజయ్, చంద్రిక, వెంకటేష్, సదయ్య, దేవేంద్ర, రేణుక, వినయ్, రజిత, కొండల్రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు.