calender_icon.png 18 May, 2025 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భోలక్‌పూర్ సమస్యలను పరిష్కరించాలి

18-05-2025 12:00:00 AM

-భోలక్‌పూర్‌లో వివిధ శాఖల అధికారులతో పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, మే 17 (విజయక్రాంతి): భోలక్‌పూర్‌లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం భోలక్ పూర్ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు వై శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై వాటర్ వరక్స్.

జీహెచ్‌ఎంసి అధికారులతో కలిసి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ రంగా నగర్, బడి మజీద్, గుల్షన్ నగర్, బొంతల బస్తి, బంగ్లాదేశ్ మార్కెట్, ఇందిరానగర్ 2 సెకండ్ వెంచర్ లో ప్రజా పాదయాత్ర నిర్వహించారు. డివిజన్లో నెలకొన్న వివిధ సమస్య లను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ డివిజన్లోని వివిధ కాలనీలు బస్తీలలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారు లను ఆదేశించారు.

అధికారులు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదన్నారు ఈ కార్యక్రమంలో యువ నాయకుడు ముఠా జైసింహ, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, శంకర్ గౌడ్, రహీం భాయ్, మక్బూల్, జబ్బార్, చాంద్ పాషా, కృష్ణ, ఉమాకాంత్ ముదిరాజ్, ఎల్లేష్, కళ్యాణ్, ప్రవీణ్, నవీన్, సుమన్, హాజీ భాష, షకీల్, గోవిందరాజ్, అధికారులు జిహెచ్‌ఎంసి డి ఈ సన్నీ, వాటర్ వరక్స్ మేనేజర్ శ్రీధర్, వర్క్ ఇన్స్పెక్టర్ దాసు నాయక్ తదితరులు పాల్గొన్నారు.