calender_icon.png 18 May, 2025 | 9:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎఫ్‌టీపీసీ తెలంగాణ మీడియా చైర్మన్‌గా కిరణ్ బేజాడి

18-05-2025 12:00:00 AM

ముషీరాబాద్, మే 17 (విజయక్రాంతి) : ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎఫ్ టిపిసి ఇండియా) తెలంగాణ రాష్ట్ర మీడియా సెల్ చైర్మన్ గా కిరణ్ బేజాడి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఎఫ్ టిపిసి ఇండియా అధ్యక్ష, కార్యదర్శులు చైత న్య జంగా, పాకలపాటి విజయ్ వర్మలు నియమక పత్రం అందజేశారు.

అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈనెల 31న దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ పేరిట సూపర్ అవార్డులను వివిధ రాష్ట్రాల్లోని పలు రంగాల్లోని ప్రముఖులకు ప్రధా నం కార్యక్రమాన్ని ఎల్.వి.ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎఫ్‌టీపీసీ ఇండియా జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో ఫిలిం సమ్మిట్స్, ఫిలిం టూరిజాన్ని అభివృద్ధి చేయడంలో నిరంతరం పాటు పడు తుందని పేర్కొన్నారు.

ఇటీవల యునైటెడ్ నేషన్ వరల్ బుక్ ఆఫ్ రికారడ్స్ సాధించడం కూడా తమ సంస్థకు గర్వకారణం అన్నారు. కిరణ్ బేజాడి మాట్లాడుతూ ఫిలిం ఇండస్ట్రీకి తన వంతు ఇతోధికంగా సాయ పడతానిని తెలిపారు. సినీ నటులు ఆహారిక, సాల్మన్ శాని, వి-5 సీఈవో, ఎండీ కె.వెంకటేష్, భాగ్యనగర్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షు డు సత్యం రాంపల్లి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మున్నూడు చందు, నటీనటులు యూ.రాజేశ్వరి, ఇంటర్నేషనల్ ఫ్యాషన్ డిజైనర్ భార్గవి వినాయక్ తదితరులు పాల్గొన్నారు.