11-08-2025 12:57:10 AM
కామారెడ్డి, ఆగస్టు 10 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా పిఎసిఎస్ ఉద్యోగుల సంగం ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్ లో ఎన్నికల నిర్వహించారు. జిల్లాలోని అన్ని పిఎసిఎస్ సంఘ సభ్యులు హాజరై అధ్యక్ష, కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జిల్లా పిఎసిఎస్ ఉద్యోగుల సంఘం నూతన అధ్యక్షుడుగా అంతంపల్లి విండో కు చెందిన శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా అచ్చంపేట విండో కార్యదర్శి సంగమేశ్వర్ గౌడ్, కోశాధికారిగా పెద్ద మల్ల రెడ్డి విండో కార్యదర్శి మోహన్ గౌడ్ ,అసోసియేట్ ప్రెసిడెంట్గా చిల్లరికి సంతోష్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ముధోలి కృష్ణారెడ్డి నూతనంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు గా ఎన్నికైన అంతంపల్లి విండో కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా సొసైటీ సభ్యులకు సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులకు ఇలాంటి ఇబ్బందులు ఉన్న తాను ముందుండి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
అంతేకాకుండా కమిటీ సభ్యులు ప్రభుత్వంతో చర్చలు జరిపి సొసైటీ సభ్యుల సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని సొసైటీ సంఘ సభ్యులు హాజరయ్యారు. అనంతరం సభ్యులకు భోజనాలను ఏర్పాటు చేశారు.