calender_icon.png 11 July, 2025 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆషాడంలో గోరింటాకుపై వసతి గృహ బాలికల సందడే సందడి

10-07-2025 10:40:52 PM

గోరింటాకుతో అందం. ఆరోగ్యం...!

వసతి గృహ మ్యాట్రిన్, విజయశాంతి

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): అనేక ప్రత్యేకతలు వున్న ఆషాడ మాసంలో సాంప్రదాయంను గౌరవించే మహిళలు ప్రత్యేకంగా అందం, ఆరోగ్యాన్నిచ్చే గోరింటాకును పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతారు. వేసవి కాలం తర్వాత వచ్చే ఆషాడ మాసం కు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మాసంలోనే వారాహి ఉత్సవాలు, బోనాల పండుగలు, తొలి ఏకాదశి, గోరింటాకు పెట్టుకోవడం లాంటివి. ఆషాడం వచ్చిందంటే ఆడవాళ్ళ చేతులు ముఖ్యంగా ముత్తైదువులు, యువతులు, బాలికలు గోరింటాకు పెట్టుకోవడంతో అందంగా ఎర్రగా కనబడతాయి. దీనిని మెహిందీగా, దక్షిణాది వైపున మహిళలు చేతులకు కాళ్లకు గోరింటాకు పెట్టుకోవడం అనవాయితీగా వస్తుంది. అనాదిగా అషాడ మాసంలో అడవాళ్లు గోరింటాకు పెట్టుకోవడం. ఇది ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగపడుతుంది. ఇంతేకాక అందంగా కనబడుతుంది. ఆషాడం వచ్చిందంటే తమ పరిసరాల్లో ఉన్న గోరింటాకు (మైదాకు) చెట్టు నుండి ఆకులు తెంపి, దానిని రోలులో దంచి మెత్తగా అయిన తర్వాత చేతులకు కాళ్లకు పెట్టుకుంటారు.

పలు ప్రాంతాల్లో మహిళలంతా కలిసి గోరింటాకును పెట్టుకొని పండుగగా జరుపుకోవడం అలవాటు. పాఠశాలల్లో, చదివే బాలికలు కూడా. గోరింటాకు ఉత్సవాన్ని జరుపుకుంటారు. గోరింటాకును. ఈ ఆషాడంలో గోరింటాకు తో మహిళలకు అనేక ఉపయోగాలు ఉన్నాయని  వసతి గృహ మ్యాట్రిన్ విజయశాంతి. ఆమె మాట్లాడుతూ గోరింటాకుతో ఔషధ గుణాలు కలిగిన గోరింటాకును పెట్టుకోవడం వల్ల శరీరంలో ఉన్న ఉష్ణాన్ని తొలగిస్తుందని దీనితోపాటు వాతాన్ని కూడా తగ్గిస్తుంది. పూర్వం మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో ఆషాడ మాసంలో ఎక్కువగా పొలంలో పనిచేస్తుండడంతో వారి పాదాలు బురదతో నిండిపోయి ఉండటం వల్ల కాళ్లలో, గోర్లలో చేరి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం. ఉంటుందనీ. గోరింటాకు పెట్టుకోవడం వల్ల చర్మ సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. అరికాలుకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలో ఉన్న వేడి తగ్గుతుంది. ఈ " కారణంగా గోరింటాకును పలు ప్రాంతాల్లో ఆడవారితో పాటు మగవారు కూడా అరికాలికి పెట్టుకుంటారు. చాలామంది మహిళలు గోరింటాకును తలపైన వెంట్రుకలకు పెట్టుకుంటారు. దీనివల్ల వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడతాయని తలకు ఎలాంటి  ఇబ్బంది పెట్టే సూక్ష్మక్రిములు ఉండవని తలనొప్పి కూడా రాదని అన్నారు,ఆషాడ మాసంలో గోరింటాను. పెట్టుకొని చేతులు ఉండవని అన్నారు.  

గోరింటాకు మహిళలకు చాలా ఇష్టం 

ఆషాడ మాసంలో తప్పనిసరిగా ప్రతి మహిళ చేతులకు కాళ్లకు గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీ అని దానివల్ల ఆరోగ్యం అందం వస్తుందని ఇది మహిళలకు ఇష్టమని  పేర్కొన్నారు ఆషాడం గోరింటాకు ప్రోగ్రాం లో పలువురు బాలికలు, వసతి గృహ మహిళా సిబ్బంది స్వప్న తదితరులు పాల్గొన్నారు.