calender_icon.png 11 July, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి దామోదర్ ను కలిసిన ఎమ్మెల్సీ

10-07-2025 10:45:02 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodar Raja Narasimha)ను ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్(MLC Dande Vittal) గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సీజనల్ వ్యాధులపై వివరించారు. జిల్లాలో వ్యాపిస్తున్న మలేరియా, డెంగీ వంటి వ్యాధుల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ తెలిపారు. సమస్యలపై స్పందించిన మంత్రి అవసరమైన అన్ని చర్యలను వేగంగా తీసుకుంటామని, ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాజి అనిల్ గౌడ్ పాల్గొన్నారు.