29-07-2025 12:21:05 AM
ఘట్ కేసర్, జూలై 28 : ఘట్ కేసర్ ము న్సిపల్ ఎదులాబాద్ గ్రామంలోని శ్రీగోదాసమేత శ్రీమన్నారు రంగనాయకస్వామి రథోత్సవం మంగళవారం అత్యంత వైభవం గా జరుగనుంది. ప్రతియేటా శ్రావణమాసం లో వారంరోజుల పాటు ప్రత్యేక పూజలతో ఉత్సవాలు జరుగుతున్నవి. 650 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈపురాతన దేవాలయా న్ని గ్రామస్థులు, వంశపారంపర్య ధర్మకర్తలు సమిష్టి సహకారంతో ఆలయానికి మరమ్మత్తులు చేయించి రంగురంగుల విధ్యుత్ దీపా లతో అలంకరించారు. బ్రహ్మోత్సవాలతో గ్రామ పొలిమేర నుంచే జాతర సందడి మొదలవుతుంది.
జాతర సందర్భంగా గ్రా మంలో పండగ వాతావరణం నెలకొంది. దసరా, దీపావళి, బతుకమ్మ పండగలకు రా కున్నాకాని రంగనాయకస్వామి జాతరకు మాత్రం బంధుమిత్రులు తండోపతండాలు గా తరలివస్తారు. రంగనాయక స్వామి కరుణాకటాక్షాలను పొందాలన్న తలంపుతో వచ్చే వేలాది మంది భక్తజనులతోనే ఈ దేవాలయం విశిష్టత తేటతెల్లంఅవుతుంది.