calender_icon.png 16 August, 2025 | 4:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ దేశాల్లో భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రత్యేక స్థానం

16-08-2025 12:00:00 AM

వీసీ యాదగిరిరావు 

 డిచ్పల్లి, ఆగస్టు 15 (విజయ క్రాంతి): తెలంగాణ విశ్వవిద్యాలయంలో 79 వ స్వాతంత్య్ర  దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్  ప్రో. టి. యాదగిరిరావు , రిజిస్ట్రార్ ఆచార్యఎం.యాదగిరితో కలిసి తేయు పరిపాలనా భవనం ముందు జాతీయ నాయకులకు నివాళులర్పించి జాతీయజెండా ను ఆవిష్కరించినారు. అనంతరం  వైస్ ఛాన్స్లర్  ప్రో. టి.  యాదగిరిరావు  కార్యక్రమంలో పాల్గొని అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది,విద్యార్థులను ఉద్దేశించి ఉపకులపతి టి యాదగిరి రావు  మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో   భారత దేశ స్వాతంత్య్ర ఉద్యమానికి  ప్రత్యేక స్థానం ఉన్నదని, అహింసా మార్గంలో  అనేకమంది ప్రాణ త్యాగాల ఫలితంగానే   భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది అని తెలిపారు.

స్వాతంత్య్ర ఫలాలను  విశాలమైన దేశంలో  అందిస్తూ పేదరికము నిరుద్యోగం వంటి  మౌలిక  సమస్యలను పరిష్కరించుకుంటూ నేడు దేశం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకు పోతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం స్వయం సమృద్ధి దేశంగా అవతరించే దిశలో భారత్ పయనిస్తుందని, 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా నిలపడానికి  పాలకులు కృషి చేస్తున్నారన్నారు. గత సంవత్సరం 6.5 శాతం ఆర్థిక వృద్ధి సాధించడమే  మన పాలకుల ఘనతకు నిదర్శనం అని పేర్కొన్నారు.  ఆర్థిక వ్యవస్థలో  ద్రవ్వోల్బణం అదుపులో ఉందని  ఎగుమతులు ఊపందుకుంటున్నాయి అని చెప్పారు. 

భారతదేశ అభివృద్ధి అనేది విద్యా రంగ అభివృద్ధి మీదనే ఆధారపడుతుందని  విద్యారంగం ద్వారా  సత్ప్రవర్తన కారుణ్య భావన  పౌరుల్లో స్థిరపడుతుందని విద్యారంగా అభివృద్ధికి  నూతన విద్యా విధానం ద్వారా కృషి చేస్తుందని  అన్నారు.  బావిభారత పౌరులైన విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు వెళుతూ మానవాభివృద్ధి సూచిక లో ముందుండేందుకు ప్రయత్నించాలని తెలిపారు..ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సంపత్ కుమార్, ఘంటా చంద్రశేఖర్,  సిహెచ్ ఆరతి,   రాంబాబు గోపిశెట్టి,ఆచార్య రవీందర్ రెడ్డి, టి.సంపత్,ప్రో. కనకయ్య,  డా. బాలకిషన్, డాక్టర్  లక్షణ చక్రవర్తి, డాక్టర్ రమణాచారి, డాక్టర్ నందిని, డాక్టర్ నీలిమ, డాక్టర్ మహేందర్,సాయి గౌడ్, భాస్కర్, వినోద్, డైరెక్టర్, పి.ఆర్వో డా. ఏ. పున్నయ్య తో పాటు  టీచింగ్ నాన్ టీచింగ్ మరియు విద్యార్థులు పరిశోధకులు  పాల్గొన్నారు.