15-08-2025 11:50:57 PM
హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమార్ పెళ్లి సమీపంలో గంజాయి రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను నార్కోటిక్స్ డ్రగ్స్ కంట్రోల్ పోలీస్ టీం ఆధ్వర్యంలో హనుమకొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కుమార్ పెళ్లి ప్రాంతంలో గంజాయి రవాణా చేస్తున్నారన్న సమాచారంతో సిఐ శ్రీకాంత్, ఎస్సై పరశురాములు సిబ్బందితో వెళ్లి మహేంద్ర కారులో గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు.
25 కిలోల 800 గ్రాముల ఎండు గంజాయి, ఐదు సెల్ ఫోన్లు, మహేంద్ర కారును పోలీసులు స్వాధీనం చేసుకొని పంచనామా నిర్వహించారు. హన్మకొండ సిఐ శివకుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులు కరీంనగర్ చెందినవారని ఎండి పైజాన్, ఎస్డి అంజార్, ఎండి అబ్బాస్, హర్షద్, అలీఖాన్ అనే వ్యక్తులను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు. ఈ సందర్భంగా హనుమకొండ ఏసిపి మాట్లాడుతూ యువత విద్యార్థులు గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని గంజాయి అమ్మిన, సేవించిన వారి వివరాలను సమాచారాన్ని ఇవ్వాలని కోరారు.