24-08-2025 12:00:00 AM
మల్కాజిగిరి, ఆగస్టు 23 : భవన్స్ వివేకానంద కళాశాలలో భౌతికశాస్త్రం, ఎలక్ట్రానిక్స్ విభాగాల ఆధ్వర్యంలో, ఐఏపిటి-ఆర్సి 22 సహకారంతో ‘క్వాంటం కంప్యూటింగ్ సంవత్సరం’ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం జరి గింది. హైదరాబాద్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వి.సుబ్రహ్మణ్యం, ఐఐఐటి హైదరాబాద్ సహాయ ఆచార్యుడు డా. ఇంద్రనీల చక్రవర్తి ప్రధాన అతిథులుగా హాజరై ఉపన్యాసాలు అందించారు.
127 మంది విద్యార్థులు పా ల్గొన్న ఈ కార్యక్రమంలో పోస్టర్ ప్రదర్శన పోటీలో 24 బృందాలు తమ ప్రతిభను ప్రదర్శించాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించడంలో ఈ కార్యక్రమం విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.