calender_icon.png 24 August, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్పొరేటర్​ 'కొప్పుల'పై చర్యలు తీసుకోవాలి

23-08-2025 11:57:01 PM

ఎల్బీనగర్​ ఏసీపీకి బీఆర్ఎస్​ నాయకుల ఫిర్యాదు ​

ఎల్బీనగర్: ఓ ప్రైవేట్ సివిల్ కాంట్రాక్టర్, మన్సూరాబాద్  కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డికి మధ్య జరుగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. ‘ఎల్బీనగర్​ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి, బీఆర్ఎస్​ శ్రేణులు గంజాయి బ్యాచ్’ అని అనుచిత వ్యాఖ్యలు చేసిన కొప్పుల నర్సింహా రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని​ బీఆర్ఎస్​ యువజన నాయకులు శనివారం ఎల్బీనగర్​ ఏసీపీ, సీఐలను  కలిసి ఫిర్యాదు చేశారు.

నిరాధార వ్యాఖ్యలు చేసిన కొప్పుల నర్సింహరెడ్డి  ఆధారాలుంటే బయట పెట్టాలని, లేకపోతే ముక్కు నేలకి రాసి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్​ కొప్పులతో ఉండేదే..  గంజాయి బ్యాచ్, ఆయన చేసేది గంజాయి వ్యాపారం అంటూ మండిపడ్డారు.  స్వయానా ఆయన బామ్మర్ది, ఆయన అనుచరుడు గంజాయి తీసుకునే ఆధారాలను ఏసీపీ, సీఐలకు అందించామని,  తగు చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.